కృతి శెట్టి ఆస్తులు, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి.ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న ఈమెకు ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇక ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు అందరికీ ఫస్ట్ ఛాయిస్ గా మారినటువంటి కృతి శెట్టి పలు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం విశేషం.మూడు వరస హిట్ సినిమాలలో నటించిన కృతి శెట్టి ఈ మధ్యకాలంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

ఈమె నటించిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో డేంజర్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. ఈమె నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ మరో రెండు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కృతి శెట్టి నేడు తన 19వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి శెట్టి బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ ఈ సందర్భంగా అభిమానులు ఈమె గురించి ఆరా తీస్తున్నారు.

కృతి శెట్టి 2003లో కృతి శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగుళూరులో జన్మించింది. తన తండ్రి వ్యాపారాల నిమిత్తం వీరు ముంబై వెళ్లారు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో చిన్నప్పటినుంచి కృతి శెట్టిని మోడలింగ్ రంగం వైపు ప్రోత్సహించింది.ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ ముంబైలో ఉన్నప్పటికీ బెంగళూరులో కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని అలాగే సొంత అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుస్తోంది.కృతి శెట్టి విషయానికి వస్తే ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈమెకు 42 లక్షల విలువైన ఆడి ఏ4, 31 లక్షల విలువైన టొయోట ఫార్ట్యూన్, 17 లక్షల విలువైన హొండాయ్ కార్లు ఉన్నాయి. అంతేకాదు  ముంబైలో బెంగళూరులో సొంత అపార్ట్మెంట్స్ కలిపి కృతి శెట్టి ఆస్తులు విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈమె నాగచైతన్య హీరో సూర్య సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: