నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ నుండి స్పెషల్ వీడియో వచ్చేది అప్పుడే..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన రమ్య కృష్ణ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించగా , నాగ చైతన్య సరసన ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇలా బంగార్రాజు మూవీ తో ఇప్పటికే ఈ సంవత్సరం మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున తాజాగా బ్రహ్మాస్త్రం అనే బాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్రలను నటించాడు.
 

ఈ మూవీ కొన్ని రోజులు క్రితమే థియేటర్ లాలి విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే నాగార్జున టాలీవుడ్ యువ దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్రం బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో వీడియోకు సంబంధించిన ఒక ప్రకటనను చేసింది. ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి గన్స్ అండ్ స్వర్డ్స్ అనే యాక్షన్ వీడియోను సెప్టెంబర్ 22 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వీడియో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: