మరీ టూ మచ్ చేస్తున్న సుమ కనకాల....!!

murali krishna
సుమ కనకాల.. బుల్లితెరపై యాంకర్ గా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వరుస షోలతో ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ కి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ సుమ అంటే ఇష్టం లేనివారు అంటూ ఉండరు.
ప్రతి ఒక్కరు ఆమెపై పాజిటివ్ గానే స్పందిస్తారు. ఇప్పటివరకైతే ఆమె యాంకరింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఎవర్ని హర్ట్ చేయదు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడదు.. తన పని తాను చేసుకోపోతూ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ కూడా హద్దులు దాటేస్తున్నట్టు అభిమానులు చెప్పుకొస్తున్నారు.
రీసెంట్గా సుమ కనకాల నాగశౌర్య హీరోగా నటించిన "కృష్ణ వింద విహారి" చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకరింగ్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో సుమ కనకాల తనదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ ఫుల్ కామెడీని పండించింది. అయితే ఈ క్రమంలోనే బ్రహ్మాజీతో ఆమె మాట్లాడిన కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
.బ్రహ్మాజీ గురించి సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..ఇద్దరు కామెడీని విపరీతంగా పండిస్తారు. ఇక ఇద్దరు ఒకే స్క్రీన్ లో ఉంటే అమ్మో ఇక అసలు చెప్పలేం అంత ఫుల్ కామెడీ అవుతుంది.
అయితే ఈ ఈవెంట్లో సుమ, బ్రహ్మజీ సరదాగా ముచ్చటించుకున్న కాన్వర్జేషన్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. యాంకరింగ్ చేస్తూ స్టేజ్ దిగి సుమ కనకాల బ్రహ్మాజీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దీంతో హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుకుందామా అంటూ బ్రహ్మాజీతో సరదాగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. దీనికి బ్రహ్మాజీ కూడా స్మైల్ ఇస్తాడు.
ఈ క్రమంలోనే సుమ ఆయనని అడిగిన ప్రశ్నలు ఎక్కడికో దారితీసాయి. ఆమె మాట్లాడుతూ .."మీ ఏజ్ ఎంత" అంటూ యాంకర్ సుమ బ్రహ్మాజీని ప్రశ్నిస్తుంది.
దీంతో బ్రహ్మాజీ నవ్వుతూ.." యు నాటీ.. ఆంటీ" అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు . ఈ దెబ్బకు సుమ ముఖం వాడిపోయింది. అంతేకాదు ఏంటో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది.. నాకెందుకే కర్మ అంటూ కట్ చేస్తుంది. దీంతో ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రహ్మాజీ కామెంట్ చేసింది అనసూయని అంటూకొందరు మళ్లీ గత విషయాలని తవ్వుకుంటున్నారు. అంతేకాదు సుమ చిచ్చు పెట్టేసి మెల్లగా తప్పించుకుంది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: