చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీని ఉత్తర అమెరికాలో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి , మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయన తార కీలక పాత్రలలో నటించగా ,  తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను కూడా మూవీ యూనిట్ ఘనంగా నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవకాశం ఉన్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటకు వచ్చింది.

గాడ్ ఫాదర్ మూవీ ఉత్తర అమెరికా హక్కులను ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకున్నట్లు ,  ఈ మూవీ ని ఉత్తర అమెరికాలో ఈ సంస్థ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గాడ్ ఫాదర్ మూవీ ని 'యూ ఎస్ ఏ' లో అక్టోబర్ 4 వ తేదిన ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి తన స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ తో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: