మోక్షజ్ఞ ఎంట్రీ తో ఎన్టీఆర్ కు లాభమా?నష్టమా?

Satvika
నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. గత మూడేళ్ల గా వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు కనీసం అతిథి పాత్ర లో కూడా అతను కనిపించలేదు. దీంతో నందమూరి అభిమానులు తమ యువ హీరో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది..

మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ పడి పోతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మోక్షజ్ఞ సినిమా ల్లో అడుగు పెట్టినా వెంటనే మైలేజ్ అయితే రాదు.. ఎందుకంటే ఒక్క సినిమాతో నే ఎవరికి నటన పై పెద్దగా గ్రిప్ రాదు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదగడానికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేయాల్సి వచ్చింది.. లవర్ బాయ్‌లాగా కనిపించి ఆ తర్వాత మాస్ టచ్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ప్రస్తుతం అమెరికా లో నటనా, డ్యాన్స్‌ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక కెమెరా ఫియర్ పోయాక అతను వెండితెర పై కనిపిస్తాడని సమాచారం..

కాగా,మోక్షజ్ఞ ఎంట్రీ తో జూనియర్ క్రేజ్ అస్సలు పడిపోదని అంటున్నారు. అతనికే ప్లస్ అవుతుందని అనే వారు లేకపోలేదు. ఎందుకంటే యంగ్ టైగర్ క్వాలిటీస్.. అతని నటనకు ఎక్కడా రీమార్క్ లేదు. ఫైటింగ్, డ్యాన్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ జూనియర్ నెంబర్ వన్. తన తమ్ముడు వచ్చినా వీరిద్దరికి గ్యాప్ చాలా ఉంటుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నప్పుడు బాలయ్య సినిమాలు చేసినా అన్నగారి క్రేజ్ తగ్గలేదు. తండ్రి కొడుకుల సినిమాల కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.. ఆ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుందని కొందరు అంటున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతి లో వరుస సినిమాలు ఉన్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత మాస్ జొనర్ లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: