RRR కి షాక్.. ఆస్కార్కి ఎంపికైన గుజరాతి సినిమా?

Purushottham Vinay
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' ఎంపికైంది.ఇది "ఆర్ఆర్ఆర్" సినిమాకు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ భారీ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఘన విజయాన్ని అందుకుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఉత్తమ నటుడు కేటగిరిలో రామరాజు పాత్రకు చరణ్, కొమరం భీమ్ పాత్రకు తారక్ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా మూవీ పబ్లిషర్ వెరైటీ చెప్పుకొచ్చింది. దీంతో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని ఆశించారు. అయితే వారందరి ఆశలు నీరుగారిపోయాయి. 


ఆస్కార్ విషయంలో ఆర్ఆర్ఆర్  సినిమాకు నిరాశ ఎదురైంది.తాజాగా ప్రకటించిన ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' ఎంపికైంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు.ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అభిమానులకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: