బాయ్ కాట్ కి వ్యతిరేకంగా దుల్కర్ షాకింగ్ కామెంట్స్?

Purushottham Vinay
ఇప్పటి దాకా పైరసీకి భయపడే చిత్ర పరిశ్రమ నేడు బాయ్ కాట్ ట్రెండ్ కి హడలిపోతుంది. భారీ చిత్రాలను ఈ నెగిటివ్ ట్రెండ్ చాలా దారుణంగా దెబ్బతీస్తుంది.ఓపెనింగ్స్ తో పాటు కనీస వసూళ్లు రాకుండా నిరోధిస్తుంది. ప్రేక్షకుల్లో నెగిటివ్ ఆలోచనలు డెవలప్ చేసి థియేటర్స్ కి రాకుండా చేస్తుంది. ఇటీవల పలు బాలీవుడ్ చిత్రాలు బాయ్ కాట్ కల్చర్ కి బలయ్యాయి. ముఖ్యంగా లాల్ సింగ్ చద్దా, లైగర్ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రను మరింతగా నెటిజెన్స్ టార్గెట్ చేశారు. విడుదలకు నెల రోజుల ముందు నుండే బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అంటూ సోషల్ మీడియా  లో ట్రెండ్ చేశారు. ఏదో రన్బీర్ కపూర్ టైం బాగుండి.. తెలుగు వాళ్ళ పుణ్యమా కనీసం సినిమాకి ఓపెనింగ్స్ అయిన దక్కాయి.బాలీవుడ్ లో తీవ్ర రూపం దాల్చిన ఈ బాయ్ కాట్ ట్రెండ్ ని పలువురు చిత్ర ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. 


తాజాగా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దీనిపై నోరు విప్పాడు. 'ఈ దారుణమైన బాయ్ కాట్ కల్చర్ బాలీవుడ్ లోనే చూస్తున్నాను. సౌత్ లో ఇలాంటి వాతావరణం లేదు. సోషల్ మీడియా విప్లవం నేపథ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన విషయాలు వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారని దుల్కర్ అభిప్రాయ పడ్డారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై మాట్లాడడానికి స్టార్స్ కూడా భయపడుతున్నారు. ఎక్కడ వారిది తప్పని మాట్లాడితే తమ చిత్రాలను టార్గెట్ చేస్తారేమో అని జంకుతున్నారు. దుల్కర్ మాత్రం తన అభిప్రాయాన్ని బాయ్ కాట్ కల్చర్ కి వ్యతిరేకంగా వినిపించాడు. ఆయన నటించిన హిందీ చిత్రం 'చుప్' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న దుల్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక చుప్ మూవీకి ఆర్ బాల్కి దర్శకుడు. సన్నీ డియోల్ మరో హీరోగా నటిస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ సీతారామం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో భారీ లాభాలు సాధించింది. తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో దుల్కర్ టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన హీరోయిన్స్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: