రాజమౌళి... మహేష్ సినిమా విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ,  దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తేరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉండగానే ఈ మూవీ కి సంబంధించి అనేక రూమర్ లు బయటికి వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆలియా భట్ ని హీరోయిన్ గా రాజమౌళి కన్ఫామ్ చేశాడు అని ,  మహేష్ బాబు సరసన ఈ మూవీ లో ఆలియా బట్ హీరోయిన్ గా నటించబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో అలియా భట్ , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించబోతున్న వార్త దాదాపు అవాస్తవం అని తెలుస్తుంది.

ఇప్పటి వరకు రాజమౌళి , మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఎవరిని కూడా కన్ఫర్మ్ చేయనట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు ,  రాజమౌళి కాంబినేషన్ లో తేరకేక్కబోయే సినిమా మహేష్ బాబు కెరియర్ లో 29 వ సినిమా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తేరకేక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు , రాజమౌళి మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: