'కృష్ణ వ్రింద విహారి' ఫ్రీ రిలీజ్ తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఆఖరుగా లక్ష్య అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కోసం నాగ శౌర్య అదిరిపోయే రేంజ్ లో బాడీ ని కూడా పెంచాడు. కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరోగా నటించాడు.
 

అనీష్ ఆర్ కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ మూవీ లో  నాగ శౌర్య సరసన హీరోయిన్ గా షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.  ఈ విషయాన్ని మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ను ఈ రోజు అనగా సెప్టెంబర్ 20 వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి జే ఆర్ సి కన్వెన్షన్స్ హైదరాబాద్ లో జరగనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను  ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: