ప్రభాస్ ఆ సినిమా మొదలెట్టేశాడా!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు శరవేగంగా రూపొందుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత రెండు చిత్రాలతో భారీ పరాజయాలను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మంచి హిట్ అందించి ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. అందుకే ఆయన హీరోగా రూపొందిన ఆది పురుస్ చిత్రాన్ని మొదటగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశాడు. వచ్చే యడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది .

ఆ విధంగా ఆది పురుష్ చిత్రం ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానుల్లో కూడా ఉంది. ఇక ఈ సినిమాతో పాటే పలు సినిమాలను కూడా మొదలుపెట్టిన ప్రభాస్ ఆ చిత్రాలను కూడా త్వర త్వరగా చేసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన అధికారికంగా ప్రకటించని ఓ సినిమాను కూడా మొదలు పెట్టేసాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉండడం నిజంగా ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో అప్పట్లో బాగా హల్చల్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు వచ్చాయి కానీ చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటిదాకా ఇవ్వలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఈ సినిమాను మొదలు పెట్టేసాడని తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ మరి మూడో సినిమాలను కూడా చేస్తూ ఉండడం విశేషం ఈ విధంగా వరుస సినిమాలను చేస్తూ తాను గట్టి కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ మారుతి సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: