రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న...... ' సార్ '...!!

murali krishna
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ గురించ అందరికీ తెలిసిందే. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మొన్నటి వరకు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడాయే..
భార్య ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత ధనుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాలీవుడ్ సినిమాలో కూడా అతడు నటించాడు.బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేశాడు ధనుష్. తమిళంతో పాటు మిగిలిన భాషల్లోనూ ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒక్కో సినిమా కోసం 40 నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ధనుష్. పాన్ ఇండియన్ స్టార్ కావడంతో నిర్మాతలు కూడా కాదనడం లేదు.
ఇప్పుడు ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. ధనుష్ ఎన్నాళ్ల నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ధనుష్ ఆతరువాత మారి, వీఐపీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించారు. తాజాగా 'సార్ ' అనే చిత్రం ద్వారా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. దీన్ని తమిళంలో 'వాతి' నిర్మిస్తున్నారు. గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ "సార్" సినిమా రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. సార్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది.
ధనుష్ సార్ చిత్రం డిసెంబర్ 2, 2022 న థియేటర్లలో విడుదల కానుంది అని తెలిపారు. మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్ లకు వెళ్లి అదే విషయాన్ని సరికొత్త పోస్టర్ తో ప్రకటించారు. ఈ సినిమా నుంచి ధనుష్ టే బుల్‌పై కూర్చొని స్టూడెంట్స్‌ను క్లాస్ పీకుతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో ధనుష్ జూనియర్ లెక్చరర్‌గా కనిపించనున్నాడు. ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. జీవి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే అదే రోజున అడివిశేష్ 'హిట్‌-2' కూడా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ధనుష్ 'తిరు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈయన నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: