'రష్మిక '...చెత్త షో లు చెయ్యొద్దు అంటున్న నేటిజన్లు.......

murali krishna
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సాధారణం గా నెటిజన్ల కామెంట్లను పెద్దగా పట్టించుకోరు. రష్మీ గౌతమ్ కామెంట్ కు స్పందిస్తే మాత్రం అవతలి వ్యక్తి సైలెంట్ అయ్యే రేంజ్ లో కౌంటర్ ఉంటుందనే సంగతి తెలిసిందే.
జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మీ ప్రస్తుతం ఈటీవీ ఛానెల్ లో ఇతర ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అనసూయ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ కు కూడా రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరించడం గమనార్హం. అయితే ఒక నెటిజన్ రష్మీ గౌతమ్ ను ఈటీవీ ఛానల్ లో చెత్త షోలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న తన దృష్టికి రావడంతో రష్మీ ఆ ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చారు. తనకు కూడా సినిమాలలో నటించాలని ఉందని తన దగ్గర ఇప్పటికే ఓకే చేసిన చాలా స్క్రిప్ట్ లు ఉన్నాయని రష్మీ అన్నారు.
నువ్వు సినిమాను నిర్మించడానికి సిద్ధమైతే టీవీ షోలకు గుడ్ బై చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్మీ అన్నారు. రష్మీ చెప్పిన జవాబు విని షాకవ్వడం సదరు నెటిజన్ వంతైంది. గతంతో పోల్చి చూస్తే రష్మీకి సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. రష్మీ సినిమాలతో మళ్లీ బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. రష్మీ మాత్రం టీవీ షోలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
రష్మీ రెమ్యునరేషన్ సైతం గతంతో పోల్చి చూస్తే భారీగా పెరిగిందని బోగట్టా. ఒక్కరోజుకు రష్మీ రెమ్యునరేషన్ 2 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. రష్మీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మీ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: