'సీతారామం' కోసం పూజా హెగ్డే ని తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

Anilkumar
ఇటీవల సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన చిత్రం 'సీతారామం' అని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇక  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ ను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు.ఇదిలావుంటే ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'సీతారామం' ప్రజెంట్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమా ...విడుదలైన కొన్ని రోజుల్లోల్లనే కాసుల వర్షం కురిపించింది.ఇకపోతే  యుద్ధంతో రాసిన ప్రేమ కథ..కాగా ఈ సినిమా చూసి సినీప్రియులు ఫిదా అవుతున్నారు.

అయితే ఇందులో రష్మిక మందన కీలక పాత్ర పోషించగా, హీరో, హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్, 
మృణాళ్ ఠాకూర్ నటించారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. 
ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ భామ మృణాళ్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. ఇక ఈమె నటించిన ఈ ఒక్క సినిమాతోనే ఈమె ఎలాంటి పాపులారిటీని సొంతం  చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా హీరోయిన్ పైన దర్శకుడు హను రాఘవపూడి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే 'సీతారామం' సినిమాలో తొలుత హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను అనుకున్నానని తెలిపారు.

అయితే, ఇక  టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను  స్టార్ డమ్ వల్ల పాత్ర హైలైట్ 
అవుతుందో కాదోనని అనుమానపడ్డానని చెప్పాడు.
కాగా ఆ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్నల సూచన మేరకు మృణాళ్ ఠాకూర్ కోసం ముంబై వెళ్లినట్లు చెప్పాడు దర్శకుడు హను..ఇకపోతే మృణాళ్ ఠాకూర్ నటించిన 'సూపర్ 30' సినిమాతో పాటు మరో చిత్రం చూసి తను ఫిదా అయ్యానని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. అయితే హిందీ 'జెర్సీ' మూవీ షూటింగ్ లో ఉన్నపుడు తాను 'సీతారామం' స్టోరి చెప్పానని,ఇక  అలా మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని హను వివరించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: