ఆర్ ఆర్ ఆర్ కోసం 40 కోట్లు ఖర్చు పెడతారా ?

Seetha Sailaja
ఈసారి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ఖచ్చితంగా ఉంటుందని గట్టి ప్రచారం గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతోంది. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘బాహుబలి’ రికార్డ్స్ ను బ్రేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీకి హాలీవుడ్ క్రిటిక్స్ నుండి మంచి ప్రశంసలు లభించాయి.

అంతేకాదు తెలుగు ప్రేక్షకులు ఈ మూవీలో అల్లూరి పాత్రలో నటించిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తే హాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం కొమరం భీమ్ పాత్రలో నటించిన జూనియర్ పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా హాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ పత్రిక రాబోయే ఆస్కార్ అవార్డ్స్ పై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించిది అని తెలుస్తోంది.

ఈ కథనం ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఈమూవీకి ఎదో ఒక అవార్డు రావడం ఖాయం అంటూ ఊహాగానాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక మూవీకి ఆస్కార్ అవార్డ్ రావాలి అంటే అంత సులువైన పని కాదని ఈ సినిమాకి ప్రచారం చాలా చాలా అవసరం అనీ దానికోసం కనీసం 5 మిలియన్ డాలర్లు అయినా ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

5 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 40 కోట్లు దాటిపోతుంది కాబట్టి అంత భారీ మొత్తాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ఖర్చు పెడుతుందా అన్నసందేహాలు కూడ వస్తున్నాయి. 2020 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న ‘పారాసైట్’ మూవీ నిర్మాతలు ఈ ఆస్కార్ అవార్డ్ కోసం 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లుగా గతంలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనితో స్వతహాగా చాల జాగ్రత్తపరుడైన రాజమౌళి టీమ్ ఈ ఆస్కార్ అవార్డుల విషయంలో అంత భారీ స్థాయిలో ఖర్చుపెట్టి సాహసాలు చేయకపోవచ్చు అన్న ఊహాగానాలు కూడ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: