విజయ్ దేవరకొండ ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడా!!

P.Nishanth Kumar
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇంతటి స్థాయిలో అభిమానులను నిరాశపరచడం ఒకసారిగా వారిలో భారీ టెన్షన్ తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు ప్రేమకథా సినిమాలుగా ప్రేక్షకులను అరవించడానికి సిద్ధమైన ఈ హీరో ఈ చిత్రంతో ఎలాంటి హిట్ కొడతాడు చూడాలి.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రకటన ఇచ్చింది. సమంత కథనాయకగా నటిస్తున్న నేపథ్యంలో ఆమె డేట్లు దొరకకపోవడంతో ఈ సినిమా యొక్క చిత్రీకరణ మరింత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని అక్టోబర్ లో పూర్తిచేసి నవంబర్ లో విడుదల కు సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపి స్తున్నాయి. డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. 

అయితే ఓ ప్రేమకథ సినిమా చేసిన సందర్భంలో తన ఇక యాక్షన్ సినిమాలో మాత్రమే చేస్తానని ప్రేమకథా సినిమాలను చేయనని చెప్పి విజయ్ దేవరకొండ అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి రొమాంటిక్ సినిమాల ద్వారానే విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి సినిమాలు చేయకపోతే ఎలా అని ఆయన అభిమానులు కొంత నిరాశ పడ్డారు కూడా కానీ ఇప్పుడు ఆయనకు యాక్షన్ సినిమా ద్వారా పరచయాన్ని అందుకోవడంతో మళ్ళీ ప్రేమ కథ సినిమాలో చేయాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఖుషీ అనే ప్రేమ కథ సినిమాను చేస్తున్న ఈ హీరో ఆ తర్వాత కూడా హను రాఘవ పూడి లాంటి దర్శకులతో కలిసి ప్రేమకథ సినిమాలను చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: