మరోసారి అలాంటి లుక్ లో మెరిసిపోతున్న పూర్ణ..!

Pulgam Srinivas
అందాల నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనదైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి 'ఓ టి టి' ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే డీ అనే డాన్స్ ప్రోగ్రాం కూడా పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే పూర్ణ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని సార్లు ఈ ముద్దు గుమ్మ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే అందులో భాగంగా తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్నాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ ని కట్టుకొని ,  అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే పూర్ణ కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మూవీబిలో ఒక కీలకమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: