'అల్లు అర్జున్ నన్ను ఆ సినిమాలు చేయొద్దన్నాడు'.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
ఇటీవల టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి.ఇక  బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా వుండగా ఈ నేపథ్యంలోనే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.ఇక  ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్ఛేసాడు.  ఈ వేదికపై శ్రీ విష్ణు మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.అయితే  తన వలనే సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చిన శ్రీ విష్ణు, బన్నీకి ఎప్పుడు ఋణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక ” అల్లూరి సినిమా అందరికి నచ్చుతోంది.. ఈ సినిమా చూసాక పోలీస్ వ్యవస్థపై మీకు గౌరవం పెరుగుతోంది. అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే.. నేను ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేశా.. అది చేశాక నాకు అల్లు అర్జున్ గారి నుంచి ఫోన్ వచ్చింది. 

అయితే ఏదో ఊరికే స్నేహితులు ఏడిపిస్తున్నారేమో అనుకున్నా కానీ నిజంగానే బన్నీ గారు పిలిచి మాట్లాడారు. కాగా రేసు గుర్రం సెట్ లో నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని మొదటి సినిమాలోనే బాగా చేశావ్.. మంచి ఆఫర్లు వస్తున్నాయా..?అని అడిగారు. అయితే అప్పటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు చేయొద్దు. ఎందుకంటే ఇక  మొదట నువ్వు ఎలాంటి పాత్ర అయితే చేశావో ఆ తరువాత కూడా నీకు అలాంటి పాత్రలే వస్తాయి.అయితే  కథలను చూసి ఎంచుకో.. ఇండస్ట్రీ మారుతోంది.. ఇంకో నాలుగైదేళ్ళ తరువాత అన్ని కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ యే వస్తాయి అని చెప్పారు.ఇక  అప్పుడు ఆయన చెప్పిన మాట ఇప్పటికి నేను గుర్తుపెట్టుకున్నాను.అయితే ఇక మళ్లీ ఒకరోజు ఫోన్ చేసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పాత్ర ఉంది చేయాలనీ అడిగారు.. వెంటనే మారు మాట్లాడకుండా చేసేసి వచ్చాను. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 

అయితే నిజంగా అల్లు అర్జున్ కు ఉన్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ ఉంది. ఇక ఇక్కడ ఒక్కచోటనే కాదు నేను.. కేరళలో ఒక గుడికి వెళ్ళాను అక్కడ నన్ను చూసి.. మీరు సన్నాఫ్ సత్యమూర్తి లో ఉన్నారు కదా అని అడిగారు.  కరోనా వచ్చాకా ఒక ఏడాది క్రితం సర్చు అని ఒక ప్లేస్ కు వెళ్ళాను.ఇక  అక్కడ కూడా నన్ను గుర్తుపట్టారు. మీరు సినిమా ఎక్కడ చూసారు అంటే యూట్యూబ్ లో చూసాం అని చెప్పారు. అయితే యూట్యూబ్ లో చూసే రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్ ఇక పుష్ప తో పాన్ ఇండియా మొత్తం తెలిసిపోయాడు. అంతేకాదు అందరు పాన్ ఇండియా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు.. కానీ బన్నీ ఇక్కడ చేస్తే అదే పాన్ ఇండియా అయిపోతుంది. అయితే నాకు ఇంత చేసిన ఆయనకు కృతజ్ఞతగా నేనేమి చేయాలో నాకు తెలియలేదు.ఇక  అందుకే ఇప్పటివరకు నా సినిమా టైటిల్స్ లో నా పాత్రలో రెండు ఏ లు వచ్చేలా చూసుకున్నా.. అల్లు అర్జున్ పేరు ఉండేలా. ఈ సినిమాలో మాత్రమే ఒక ఏ మిస్ అయ్యింది.. అందుకే అల్లు అర్జున్ ను ఈ ఈవెంట్ కు రమ్మని పిలిచాను.చివరిగా  ఆయన వలనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: