సీతారామం చిత్ర బృందానికి అభిమాని లేఖ.. ఎమోషనల్ తో రిప్లై ఇచ్చిన దుల్కర్..!!

Divya
సక్సెస్ఫుల్ డైరెక్టర్ హాను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన ఒక అందమైన ప్రేమ కథ చిత్రం సీతారామం. మొదట ఈ సినిమా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సంపాదించింది.ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ జంటగా నటించారు ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో రష్మిక నటించింది.. ఇక జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో పనిచేస్తున్న ఒక అనాధ ఆర్మీ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ లెఫ్ట్నెంట్ రామ్ గా నటించారు. ఈ సినిమా దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఇక ఈ చిత్రం ఓటిటిలో కూడా విడుదలై మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతోంది ఇప్పటికి ఈ సినిమాలోని పలు డైలాగులు సన్నివేశాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి అలాగే సీతారామం చిత్ర యూనిట్ కు  ఇతర దేశాల నుండి ఒక అభిమాని అందమైన ప్రేమలేఖ రాయడం జరిగినట్లుగా తెలుస్తోంది ఇది చూసిన దుల్కర్ సల్మా ఎమోషనల్తో రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
2006వ సంవత్సరంలో భారతీయ సినిమా సంగీతానికి ఫోల్యాండ్ అభిమాని అయిన మౌనిక తన ట్విట్టర్ ద్వారా సీతారామం చిత్ర బృందానికి ప్రేమను కురిపిస్తూ ఒక నాలుగు పేజీలతో కూడిన ప్రత్యేకమైన లెటర్ ను రాసింది. ఇక ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా నటించిన వీర్ జార్ చిత్రంతో పోల్చడం గమనార్హం. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ అంటూ ఆమె తెలిపింది. దుల్కర్ సల్మాన్ ఆమె పోస్ట్ కు రిప్లై ఇస్తు.. అందమైన లేక మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు మిమ్మల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నాను సినిమా పట్ల మీరు చాలా గొప్ప అవగాహనతో ఈ లెటర్ రాశారు . మీ ప్రతిభకు ఒక హాండ్స్ ఆఫ్ వంతు దుల్కర్ రిప్లై ఇచ్చారు. ఇక ఈ లేఖలు మౌనిక నేను లెఫ్ట్నెంట్ రామ్ ప్రేమలో పడిపోయాను అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: