వామ్మో:మరో చిత్రానికి సిద్ధమైన లెజెండ్ హీరో శరవణన్..!!

Divya
వ్యాపారవేత్త  అరుల్ శరవణన్  పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చెన్నైలో ఈయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. దీంతో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన నటన పైన ఆసక్తి ఉండడంతో ఏకంగా 50 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ఇచ్చారు. ఇక ఈయన నిర్మాణంలోనే ది లెజెండ్ అనే చిత్రాన్ని ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో ఏకంగా 60 కోట్లకు పైగా బడ్జెట్ తో కేటాయించి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక అరుల్ శరవణన్ సరసన ఊర్వశీ రౌతెలా హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో ఈమె నటించినందుకు గాను రూ. 3 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ సినిమా తన షాపింగ్ మాల్స్ కి భారీగా ప్రమోషన్స్ కు ఉపయోగపడిందని చెప్పవచ్చు.. అలా మొదటి సినిమాతో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ నటుడు రెండవ సినిమాను చేయడానికి ప్రస్తుతం సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ ఫిలిం ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అరుల్ కొత్త సినిమా మూవీ యాక్షన్ రొమాంటిక్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు సైతం మొదటి సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ఈ నటుడు మరి రెండవ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నారో అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ వయసులో కూడా తన నటన మీద ఆసక్తితోనే ఎవరు ఏమనుకున్నా తన అనుకున్న పని చేసుకుంటూ వెళుతున్నారు హీరో శరవరణన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: