అజయ్ దేవగన్ కు షాక్ ఇచ్చిన కువైట్ ప్రభుత్వం...

murali krishna
చాలా కాలంగా బాలీవుడ్ లో సినిమాలకు గ్రహణం పట్టినంత పని అవుతోంది. బాలీవుడ్ సినిమాలను ఆడియన్స్ బాయ్ కాట్ చేస్తుండటం, పెద్ద సినిమాలేవి సరిగ్గ ఆడక ఫెయిల్యూర్ బాట పడుతుండటంతో.


బాలీవుడ్ లో ఎవరికి ప్రశాంతత లేకుండా పోయిందట.. అయినా సరే వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే టైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రా కాస్త ఊరటనిచ్చిందనుకోవా లి. అది కూడా రాజమౌళి హ్యాండ్ పడబట్టే ఈ కాస్త అయినా సక్సెస్ అయ్యిందన్నది అందరికి తెలిసిందే.


ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే కస్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ సినిమా కు మరో షాక్ తగిలిందట.. అజయ్ దేవగణ్ నటించిన్ థాంక్ గాడ్ సినిమాకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసినిమా ను అనుమతించేది లేదంటూ అక్కడి ఫిల్మ్ బోర్డ్ ఖచ్చితంగా చెప్పేసింది. మత విశ్వాసాల ను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణం తో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందట. సినిమాపై నిషేధం కూడా విధించింది.


ఇక ఈ సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే... సినిమా విడుదల కు అనుమతిస్తామని కూడా తెలిపింది. ఈ సినిమా ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమా లో చిత్రగుప్తుడి గా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. ఫోన్ మాట్లాడుతూ కారు నడిపిన సిద్థార్థ్ యాక్సిడెంట్ లో చనిపోయి నరకానికి వెళ్తాడు. అక్కడ చిత్రగుప్తుడిగా ఉన్న అజయ్ దేవగన్ సిద్థార్డ్ చేత ఓఆట ఆడిస్తాడు. ఇలా ఫాంటసీ కథతో.. డిఫరెంట్ గా.. కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందట.. మరి చూడాలి కువైట్ కోసం ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేస్తారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: