నన్ను ఆ హీరో తో పోల్చకండి... దుల్కర్ సల్మాన్..!

Pulgam Srinivas
అద్భుతమైన టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగు లో మహానటి ,  సీతా రామం వంటి రెండు తెలుగు మూవీ లలో నటించి రెండు మూవీ లతో కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్ ఇతర భాషలలో నటించిన మూవీ లు కూడా తెలుగు లో డబ్ అయ్యి ,  విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి. ఇది ఇలా ఉంటే దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగు లో నటించిన సీతా రామం మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించగా ,  హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దుల్కర్ సల్మాన్ ,  షారుక్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. షారుక్ ఖాన్ కు తాను పెద్ద అభిమానిని అని ,  ఆయన మూవీ లు చూస్తే పెరిగాను అని దుల్కర్ సల్మాన్ చెప్పు కొచ్చాడు. షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తనకు ఇష్టమైన సినిమా అని ,  తనకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం కలిగితే షారుక్ ఖాన్ ను తలుచుకుంటాను అని దుల్కర్ సల్మాన్ చెప్పు కొచ్చాడు. అలాగే షారుక్ ఖాన్ తో తనను పోల్చవద్దు అని , ఆయన ఒక లెజెండ్ అని దుల్కర్ సల్మాన్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: