రాజమౌళి... మహేష్ మూవీలో ఆ బాలీవుడ్ హీరోయిన్..?

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో దర్శకుడుగా కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి తాజాగా విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వరకు దర్శకత్వం వహించిన అన్ని మూవీ లతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరును తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించుకున్న రాజమౌళి తన తదుపరిని మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ విషయాన్ని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతోంది. రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ మహేష్ బాబు కెరియర్ లో 29 వ మూవీగా తేరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటిఫుల్ దీపికా పదుకొనే హీరోయిన్ తీసుకోవాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: