ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ శుక్రవారం విడుదల అయిన తెలుగు సినిమాలు..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ శుక్రవారం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అలా ఈ వారం విడుదల అయిన సినిమాలలో మూడు సినిమాలపై తెలుగు సినీ ప్రేమికులు పర్వా లేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. మరి ఈ వారం మంచి అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన ఆ మూడు సినిమాలు ఏవో తెలుసుకుందాం. సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మంచి అంచనాల నడుమ నిన్న అనగా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల ఆయన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు కూడా మూవీ యూనిట్ ఆశించిన మేర కలెక్షన్ లు దక్కనట్లు తెలుస్తోంది. రాజీనా కేసాండ్రా , నివేద థామస్ ప్రధాన పాత్రలలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  షాకిని డాకిని మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఈ రెండు మూవీ లతో పాటు నిన్న మంచి అంచనాలతో విడుదల అయిన మూవీ లలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ ఒకటి. ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: