'స్రవంతి' రవికిశోర్ వల్లే అది సాధ్యమయ్యిందట!!

P.Nishanth Kumar
తమిళ నాట మంచి గుర్తింపు కలిగి ఉన్న హీరో శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'వెందు తనిందదు కాడు'. తెలుగు లో ఈ సినిమా ను ది లైఫ్ అఫ్ ముత్తు అనే పేరుతో విడుదల చేశారు. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక నటించగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. తెలుగు లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉన్న శింబు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ కాగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ఎంతో నమ్మకం తో ఈ సినిమా ను విడుదల చేశారు.
అంతకు ముందు శింబు చేసిన సినిమా మానాడు సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు పెరిగిపోయాయి. తమిళంలో రెండు రోజుల ముందుగానే విడుదల అయినా ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. దాంతో తెలుగు లో తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని భావించి ఇక్కడ భారీ గా విడుదల చేసింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అనుదుకుంది సినిమా బృందం. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడగా  తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేసి ఈ సినిమా ను ఇక్కడ కూడా విడుదల చేద్దామని అన్నారు.   పాటలు విన్నాను. బావున్నాయి అని ప్రశంశిచారు. ట్రైలర్ చూశాక విడుదల చేయాలనే ఇదే వచ్చింది అని అయన అన్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధియించిన ఈ సినిమా ను ఫ్యూచర్ లో హిందీ లో కూడా విడుదల చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు. శింబు ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్లడం నిజంగా అయన అభిమానులను ఎంతో ఆనంద పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: