ఖుషి సినిమా షూటింగ్ అందుకే ఆలస్యం అవుతుందా!!

P.Nishanth Kumar
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తర్వాత డిసెంబర్ లో ఖుషి సినిమాను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రేమకథా సినిమాలను ఎంతో అద్భుతంగా రూపొందించే దర్శకుడైన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని బాగా చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. వీటిలో దాదాపు 50 శాతం సినిమా షూటింగ్ను పూర్తి చేసిన చిత్ర బృందం త్వరలోనే మిగతా భాగాన్ని పూర్తి చేసి చెప్పిన టైం ప్రకారం డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవ్వడం ఒకసారిగా విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఇంతలా ఆలస్యం అవ్వడానికి కారణం సమంత అనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక రేర్ డిసీజ్ తో ఆమె బాధ పడుతుందని అందుకే ఆమె ఈ సినిమా చేయడానికి సముఖంగా లేదని ఇది తగ్గిన తర్వాతనే సినిమా షూటింగ్ లో అడుగుపెడతానని ఆమె దర్శక నిర్మాతలకు వెల్లడించిందట.

ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె త్వరలోనే సినిమా యొక్క షూటింగ్లో పాల్గొన్న పోతుందట. మరి ఈ విధంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో ఇదే నిజమని చాలామంది అనుకుంటున్నారు. దీనిపైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తే మంచిది. ఏదేమైనా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ద్వారా తప్పకుండా విజయ్ దేవరకొండ మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తూ ఉండడం విశేషం. చాలా రోజుల తర్వాత ఓ ప్రేమ కథ సినిమా తో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: