ప్రగతి ఆంటీ హీరోయిన్ గా నటించిన సినిమాలేంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆమె ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాల్లో అమ్మ పాత్రలో అత్త పాత్రలో నటించి మెప్పించింది.ఇకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియో లతో వైరల్ అయింది.జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో సందడి చేస్తూ బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యింది.ఇక ఒక హీరోయిన్ స్థాయి క్రేజీ దక్కించుకున్న ప్రగతి ఈ వయసులో కూడా అందాల ఆరబోత విషయంలో వెనక్కి తగ్గకుండా స్కిన్ షో చేస్తుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రగతి చాలా కష్టపడి కెరియర్ లో పైకి ఎదిగింది. ఆమె కెరియర్ ఆరంభంలోనే చాలా ఇబ్బందులను పడింది. అంతేకాదు తనకంటే వయసులో చాలా పెద్ద వారైనా హీరోలకి తల్లి పాత్రలో నటించాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చింది. అయినా  కృంగి పోకుండా ఇండస్ట్రీలో నిల తొక్కుకోవాలని ఉద్దేశంతో చాలా అవమానాలను ఎదుర్కొంది.ఇకపోతే ప్రగతి అందంగా నటన విషయంలో చాలా ప్రతిభ కలిగిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. అందుకే ఇక  ఈమెను మోస్ట్ టాలెంటెడ్ భారతి రాజా ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు.

కాగా  ఆయన తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. వీట్ల విదేశాంగ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా ప్రగతి నటించింది.ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ప్రగతి హీరోయిన్ గా నటించింది.  అదృష్టం కలిసి రాకపోవడంతో ప్రగతికి హీరోయిన్ గా సక్సెస్ దక్కలేదు. ఇక దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నం చేస్తూ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్లీ హీరోయిన్ గా చేయాలని ప్రగతి భావించింది.అయితే ఒకసారి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్‌ ఆరంభించిన తర్వాత మళ్ళీ ఆమె వెనుతిరిగి చూసుకోలేదు.అంతేకాదు  అలాగే హీరోయిన్ గా కూడా ఆఫర్లు రాలేదు.అయితే  దాంతో ప్రగతి సుదీర్ఘ కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతూ వస్తున్నారు.అంతేకాదు  ఆమె మరో 10, 20 సంవత్సరాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: