ప్రభాస్ పెళ్లి గురించి డైరీ లో రాసుకున్న కృష్ణం రాజు...?

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీలో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం అయితే లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటుల తర్వాత ఆ స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు కృష్ణంరాజే..ఆయన ఫ్యామిలీ, మాస్, యూత్ ఆడియన్స్ ను కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన 1980 వరకు సినిమాలలో ఆయన యాక్టివ్ గా ఉన్నారు.


ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి చేరి రాజమండ్రి నుండి పోటీ చేసినప్పుడు ఓడిపోవడంతో మళ్లీ రాజకీయాల వైపు ఆయన అడుగుపెట్టలేదు. ఇక ప్రభాస్ నటించిన సినిమాలలో అప్పుడప్పుడు నటిస్తూ వచ్చారు..ఇక సెప్టెంబర్ 11 ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.


ఇకపోతే ఆయన బ్రతికున్నన్ని రోజులు ప్రభాస్ కి పెళ్లి చేయాలి అనే ఆలోచనలోనే ఉండేవారట.. ఇక ప్రభాస్ కోసం గోదావరి జిల్లాలకు చెందిన రాజుల వంశస్థుల అమ్మాయిలను కూడా చూశారని, ఇక ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేస్తామని చెప్పి.. ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయట.. అయితే ప్రభాస్ - అనుష్క ప్రేమలో ఉన్నారంటూ.. వీరి పెళ్లికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లే ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం విశేషం.. అయితే కృష్ణంరాజు మరణాంతరం ప్రభాస్ - అనుష్క పెళ్లి మళ్లీ వైరల్ గా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కృష్ణంరాజు తన డైరీలో ఇలా రాసుకున్నారట. ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అనుష్కతో ప్రేమే కారణం అని రాసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేశారు. ఇలాంటి విషయాలను కృష్ణంరాజు అస్సలు డైరీలో రాసుకోరు.. అసలు ఆయనకు డైరీ రాసే అలవాటే లేదు.. రాజు గారికి ఏదైనా సరే ముఖం మీద చెప్పే అలవాటు.. తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ కూడా ఆయన సన్నిహితులు మీడియాకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారట. ఏది ఏమైనా ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: