చలాకి చంటి జీవితంలో.... కన్నీటి గాధలు...!!

murali krishna
చలాకీ చంటి జబర్దస్త్ కమెడియన్. సినిమాలలో కూడా రాణిస్తున్నాడు. ఈయన 1986లో హైదరాబాద్ లో జన్మించాడు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఇతని అసలు పేరు వినయ్ మోహన్.ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత చలాకి చంటి గా మారిపోయాడు అని అందరికి తెల్సిన విషయమే.....
ఇతనికి ఊహ తెలియనప్పుడే తండ్రి చనిపోవడం జరిగింది. తరువాత కొన్ని రోజులకు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తల్లి మరణించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం జీర్ణించుకోలేకపోయాడు.
ఇక అప్పటి నుండి ఎవరితో ప్రేమగా, చనువుగా కాకుండా కాస్త దూరంగా ఉంటున్నాడు. పెళ్లయిన తర్వాత కూతురు పుడితే, తన తల్లి మళ్ళీ పుట్టిందని గంట పాటు ఏడ్చి, సంతోషించాడు. కూతురిపై ఉన్న ప్రేమ కూడా మనసులోనే దాచుకున్నాడు. ఎందుకంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తే దూరం అవుతారని అందరితో కలిసి పోయే విధంగా ఉండడు.
ఇక చదువు అయిపోయాక టాటా ఇండికాంలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత రేడియో మిర్చిలో అడిషన్స్ కు వెళితే రేడియో జాకీలో సెలెక్ట్ అయ్యాడు. అందులో చంటి బంటి ప్రోగ్రాం ద్వారా తన నిక్ నేమ్ చంటిగా మారింది. తరువాత ట్యాంక్ బండ్ టూరిజం లో మిమిక్రీ ఆర్టిస్టుగా పార్ట్ టైం జాబ్ చేసేవాడు. తర్వాత 2013లో వచ్చిన బుల్లితెర షో జబర్దస్త్ లో చలాకీ చంటిగా, టీం లీడర్ గా కొనసాగుతున్నాడు.
తరువాత జల్లు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమా పరాజయం అయింది. దానితో చాలా బాధ పడ్డాడు చంటి.తర్వాత భీమిలి కబడ్డీ జట్టు సినిమా ద్వారా గుర్తింపు లభించింది. దీనితో చంటి లో కాన్ఫిడాన్స్ లెవెల్ బాగా పెరిగింది.తర్వాత నా షో నా ఇష్టం కు గొస్ట్ గా కూడా పనిచేశాడు. ఇక జబర్దస్త్ షో, సినిమాలలో రాణిస్తున్న చలాకి చంటి ప్రస్తుతం బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. ఎన్నో కష్టాలను అనుభవించిన మన చంటికి ముందు ముందు మంచి ఆఫర్స్ రావాలని చంటి అభిమానులు కోరుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: