పాకెట్ మనీ కోసం చరణ్ ను డబ్బులు అడిగిన పవన్ కళ్యాణ్..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆస్తుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషకం అందుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ దగ్గర పాకెట్ మనీ కోసం అప్పు చేశారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే చిరుత సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
అప్పుడు ఆ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లో హీరో అయిన తర్వాత వదినమ్మను డబ్బులు అడిగే పరిస్థితి లేదని, ఒకవేళ డబ్బులు అడిగితే హీరో అయిపోయావు కదా ఇంకేంటి డబ్బులు అని వదిన అనుకుంటుందని భావించాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఆ తర్వాత చరణ్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకునేవాడిని.. నాకు చాలా సినిమాలు వస్తాయని వడ్డీతో పాటు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి చరణ్ పాకెట్ మనీని కూడా నేను తీసుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు..

అంతేకాదు వడ్డీ ఇస్తారు కదా అని వెంటనే ఇచ్చే వాడినని చరణ్ కూడా వెల్లడించారు. అయితే చరణ్ దగ్గర తీసుకున్న అప్పును ఇంకా చెల్లించలేదు అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పాత వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే తాజాగా ఈయన నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధం కానుంది. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా క్రిష్ వ్యవహరిస్తుండగా ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: