విక్రమ్ వేద: రిలీజ్ కి ముందే రికార్డులు?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరోస్ హృతిక్ రోషన్ ఇంకా అలాగే సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్ వేద' అదే టైటిల్ తో బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే హిందీ వెర్షన్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రీలీజ్ అయిన ప్రచార చిత్రాల కారణంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఎన్నో అంచనాలు  పెంచేస్తుంది. దీంతో అభిమానుల్లో ఎప్పుడెప్పుడు చూద్దామ్మా? అన్న ఎగ్టైట్ మెంట్ రెట్టింపు అవుతుంది. 175 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో విడుదల సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో బ్రహ్మాస్ర్త రికారడును రిలీజ్ పరంగా విక్రమ్ వేద బీట్ చేస్తున్నట్లు చెప్పొచ్చు. బ్రహ్మస్ర్త ని వరల్డ్ వైడ్ దాదాపు 9000 థియేటర్లలో రిలీజ్ చేసారు.


తాజాగా విక్రమ్ వేదని అంతకు మించి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఇంత వరకూ ఏ బాలీవుడ్ సినిమా 100 దేశాల్లో రిలీజ్ కాలేదు. కానీ విక్రమ్ వేదని చెప్పి మరీ మేకర్స్ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. దీంతో విక్రమ్ వేద రిలీజ్ కి ముందే బాలీవుడ్ లో ఓ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. విక్రమ్ వేదపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో బాలీవుడ్ అన్ని సమీకరణాలు మారుతాయని ట్రేడ్ అంచనా వేస్తుంది.బాలీవుడ్ లో ఇప్పటివరకూ కూడా ఎన్నో సోషియా ఫాంటసీ చిత్రాలు చారిత్రక నేపథ్యం గల సినిమాలు.టెక్నికల్ గా హైస్టాండర్స్ లో రూపొందిని సినిమాల నిర్మాణం జరిగింది. వాటి కోసం వందల కోట్లు ఖర్చు చేసారు. వాటిని వరల్డ్ వైడ్ గానూ అంతే భారీ తనంతో రిలీజ్ చేసారు. కానీ 100 దేశాల్లో ఏ చిత్రాన్ని ఇంత వరకూ వివిధ భాషల్లో రిలీజ్ చేయలేదు.కానీ 'విక్రమ్ వేద'ని మాత్రం 100 దేశాల్లో రిలీజ్ చేయడం బాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో విక్రమ్ వేద నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: