కరణ్ జోహార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ...!!

murali krishna
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కరణ్ జోహార్ కి సినిమాతో సంబంధం ఉండడం వల్లే లైగర్ సినిమా ని బాయ్ కాట్ చేసారని సంచలనం వ్యాఖ్యలు చేసారు...
విజయ్ దేవరకొండ దూకుడు స్వభావం లైగర్ సినిమా పరాజయానికి కారణమని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, "విజయ్ స్టేజ్‌పై సహజంగా దూకుడుగా ఉంటాడు. అతను అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. కానీ బాలీవుడ్‌ లో లైగర్ ని బాయ్‌కాట్ చెయ్యడానికి ముఖ్య కారణం ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న కరణ్ జోహార్.వర్మ మాటలకూ కరణ్ అభిమానులు కోపం తో రగిలిపోతున్నారు.. వర్మ స్టార్ డైరెక్టర్ ని అవిధంగా అనకూడదని కరణ్ ఫ్యాన్స్ అంటున్నారు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి, బాలీవుడ్ జనాలు కరణ్ సినిమాలను బహిష్కరించడం సర్వసాధారణమైపోయింది. లైగర్ వైఫల్యానికి విజయ్ యొక్క దూకుడు వైఖరి కూడా కారణమని ఆయన అన్నారు. "జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ల వినయం మరియు ఎంత ఎదిగిన ఒదిగే ఉండే తనం హిందీ ప్రేక్షకులకి ఎంత గానో నచ్చింది.ఇన్ని రోజులు బాలీవుడ్ తారల అహంకార వైఖరి ని చుసిన హిందీ ప్రేక్షకులు, మన తెలుగు హీరోల యొక్క నిరాడంబరత, వినయం చూసి ఆశ్చర్యపోయారు. కరణ్ అభిమానులు తెలుగు స్టార్స్ ని ఎంతో గౌరవిస్తారని చెప్పుకొచ్చారు.. కానీ వర్మ జోహార్ గురించి ఇలా అనడం ఏమి బాగోలేదని అన్నారు…
విజయ్ లైగర్ ఈవెంట్‌లలో తన సహజమైన దూకుడు ప్రసంగాలు చెయ్యడం కూడా హిందీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇది లైగర్ సినిమా ని బాయ్ కాట్ చెయ్యడానికి వారిని మరింత ప్రేరేపించింది." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: