మహేష్ - రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా 'ఆర్ ఆర్ ఆర్' బ్యూటీ..?

Anilkumar
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన రాజమౌళి  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇదిలావుంటే ఇటీవల నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు.ఇక  ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ తో మూవీ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు.అంతేకాదు కథ కూడా ఫైనల్ కాగా... ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం. అయితే మహేష్ కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో కథ సిద్ధం చేశారు.ఇకపోతే  రాజమౌళి సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇదిలావుంటే ఇటీవల ఓ అంతర్జాతీయ వేదికపై మాట్లాడిన రాజమౌళి మహేష్ మూవీ గురించి పెదవి విప్పారు. అంతేకాదు ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ అన్నారు. ఇకపోతే జేమ్స్ బాండ్ మూవీ తరహాలో ఉండొచ్చని హింట్ ఇచ్చారు.

ఇక  ఈ క్రమంలో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే రాజమౌళి తన గత చిత్రాలకు మించి అత్యంత భారీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. కాగా ప్రాజెక్ట్ వ్యయం రూ. 500 కోట్లకు పై మాటే అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన ఆసక్తితో ఉన్నారు.  ఈ మూవీకి గురించి మరొక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.ఇక  రాజమౌళి హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేశారట.అంతేకాదు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సందు ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మహేష్ కి జంటగా అలియా భట్ నటిస్తున్నట్లు వెల్లడించాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు.

ఇదిలావుంటే ప్రస్తుతం గర్భంతో ఉన్న అలియా భట్ డెలివరీ తర్వాత రాజమౌళి మూవీ షూట్ లో పాల్గొంటారట. ఇక దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కి జంటగా అలియా భట్ నటించారు. అయితే ఇక  ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం నిరాశపరిచింది.ఇకపోతే  ఈ విషయంలో అలియా భట్ కూడా నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ మూవీలో అయినా రాజమౌళి ఆమె టాలెంట్ కి సరిపోయే పాత్ర ఇస్తారేమో చూడాలి.ఇదిలావుంటే  మరోవైపు మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: