హైపర్ ఆదికి.. అమ్మాయిలంటే అంత చులకనా?

praveen
బుల్లితెరపై హైపర్ ఆది నడిపించే హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక టీం లీడర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఏ షో లో కి వెళ్ళినా సరే తన పంచులతో ఇతర కమెడియన్స్ పై  ఆధిపత్యం చెలాయించాలని  భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పంచుల సునామీ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే కేవలం షో లో ఉన్న తన సహచర కమెడియన్ పైన మాత్రమే కాదు జడ్జిల దగ్గర నుంచి యాంకర్ల వరకు ఎవరిని వదలకుండా పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది.

 అయితే కొన్ని కొన్ని సార్లు హైపర్ఆది వేసే పంచులు  కాంట్రవర్సీ లకు దారి తీస్తూ ఉంటాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పంచులతో ఎన్నోసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు హైపర్ ఆది.   అమ్మాయిలు ఆది కళ్ళముందు కనిపించారు అంటే చాలు వారిపై సెటైర్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా అబ్బాయిలు అమ్మాయిల ని ఎత్తుకొని మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటారు. అయితే  హైపర్ ఆది మరింత రెచ్చిపోయి ప్రతి వారం ఎపిసోడ్ లో ఇలాంటి ఆట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తాడు.
 ఇలా ఒక రకంగా అమ్మాయిలను చిన్నచూపు చూస్తూ సెటైర్లు వేయడం పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆడవాళ్లు అంటే హైపర్ ఆది కి అంత చులకనా అంటూ ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా హైపర్ ఆది ఆడవాళ్లపై  ఇలాంటి చెత్త కామెంట్లు చేసి చివరికి విమర్శలు ఎదుర్కొన్నాడు అనే విషయం తెలిసిందే.  షో లో ఏం మాట్లాడిన చెల్లుతుంది అని హైపర్ ఆది అనుకుంటున్నాడ అంటూ ఎంతో మంది ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: