జీవితంలో నేను చేసిన దిద్దుకోలేని తప్పు అదే: ధనరాజ్

Anilkumar
ప్రముఖ కమెడియన్ గా , నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్  అందరికీ సుపరిచితమే. ఇటీవల ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన రాజ్ తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశానంటూ ఎమోషనల్ అయ్యారు..ఇదిలావుంటే ఇక ధనరాజ్ ముందుగా జబర్దస్త్ ద్వారానే తన కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే  2013 ఫిబ్రవరి మొదటి వారంలో జబర్దస్త్ షో మొదలైంది. ఇకపోతే తెలుగు టీవీ పై అంతకుముందు కొన్ని కొన్ని కామెడీ షోలు వచ్చాయి. 

ఇది మాత్రం అన్నింటికంటే డిఫరెంట్.. ఇక జబర్దస్త్ షోలో ఇద్దరు జడ్జిలు .. ఆరుగురు టీం లీడర్స్ .. వాళ్ళు చేసే స్కిట్స్.. చివర్లో టీం లీడర్స్ అందరికి ఒక గేమ్.. ఒక ఎపిసోడ్ ఇలా జరిగేది. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు జబర్దస్త్ ప్రసారం చేసేవారు. తెలుగు ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఇక అలా 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతోంది.మొదట్లో చంటి , ధనరాజ్ , వేణు, రాఘవ లాంటివాళ్ళు జబర్దస్త్ లో కమెడియన్లుగా కొనసాగించారు.సంవత్సరాలు గడిచే కొద్దీ అందులో ఉండే కొంతమంది టీం లీడర్స్ వెళ్లిపోయారు.అయితే  అలాంటి వారిలో ధనరాజ్ కూడా ఒకరు. ఇక తను అసలు ఎందుకు షో మారాల్సి వచ్చిందో ఇటీవల ఒక షో లో తెలియజేశారు.

అయితే  జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో ఒకరోజు వేణు వచ్చి మరో ఛానల్లో మనిద్దరికీ యాంకర్స్ గా ఒక ప్రోగ్రాం లో అవకాశం వచ్చిందని చెప్పాడు . ఇదిలావుంటే ఇక్కడ కమెడియన్స్ గా చేస్తున్నామ్ కదా.. యాంకర్స్ గా పర్వాలేదా అని నేను అడిగితే.. ఏం కాదు చేద్దామని హామీ ఇచ్చాడు.ఇక  అలా ఒక 13 ఎపిసోడ్స్ ఆ చానల్లో చేసాము అని ధనరాజ్ తెలిపాడు. అయితే అదే సమయంలో జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ , రాకేష్ , ఆర్ పి టీమ్స్ వచ్చాయి.అయితే  మళ్లీ వెనక్కి వెళ్తే కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుందని అందుకే షో కి తిరిగి అడుగు పెట్టలేదు . నేను దిద్దుకోలేని తప్పు ఏదైనా చేశాను అంటే అది జబర్దస్త్ వీడడమే అంటూ పశ్చాతాపం వ్యక్తం చేశాడు ధనరాజ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: