ఒకే ఒక జీవితం హిట్టే కానీ కలెక్షన్లే!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలు మంచి విజయాలనే అందుకుంటున్నాయి. తొలిరోజు నుంచి ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడం అందరినీ ఎంతగానో ఆనందపరుస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని వారికి ఇది తీపి కబురు అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుస సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏమైపోతుందో అని ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు.

కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే విడుదల అవుతున్న సినీమాలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ విధంగా థియేటర్లకు ప్రేక్షకులు అలవాటు పడుతున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ఒక సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ చిత్రానికి కలెక్షన్లు పెద్దగా రాకపోవడం నిజంగా పెద్దగా అందరూ టెన్షన్ పడాల్సిన విషయం అనే చెప్పాలి. శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం పోయిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకోగా ఈ సినిమాకు మంచి బజ్ ఉన్న కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకపోవడంతో ఆ సినిమా కు కలెక్షన్లు రావడం లేదు అనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. 

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన శర్వానంద్ చాలా రోజుల తర్వాత విజయాన్ని అందుకున్నాడు అనుకుంటే ఆయనకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడడం నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. కమర్షియల్ ఎలిమెంట్లు లేకపోవడం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఈ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు చూడడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను చూస్తున్న కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్లు తక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు అటూ ఇటూ అయితే ఈ చిత్రానికి కలెక్షన్లు ఏమైనా పెరుగ వచ్చేమో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: