మెగా అభిమానులకు భారీ సర్ప్రైస్..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు


పైగా ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ ప్రేక్షకులకు అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ ఏదీ హైదరబాద్‌లో ప్లాన్ చేయట్లేదట.. రెండు ఈవెంట్లు చేయనుండగా ఒకటి ముంబైలో, మరొకటి అనంతపురంలో చేయనున్నారని సమాచారం.


మొత్తానికి హైదరాబాద్‌లో గాడ్ ఫాదర్ ఈవెంట్ లేదని తేలిపోయింది. అనంతపురంలో జరిగే ఈవెంట్ లో ఓ స్టార్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా హైప్‌ను మరింత పెంచేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట చిత్ర బృందం. మరి ఇది ఖాయమైతే మాత్రం మెగాఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. కారణం పవన్ - చిరును ఒకే వేదిక పై చూసి చాలా కాలం అయ్యింది.


అందుకే, ఈ వేడుకకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారట . పైగా ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగడంతో సినిమా పనుల్లో స్పీడ్ డబుల్ అయిందని తెలుస్తుంది.. ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడని సమాచారం..


పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు.


అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయట. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: