నాకు నటన రాదని... మూవీలు చేయడం ఆపేస్తే మంచిదని అన్నారు... దుల్కర్ సల్మాన్..!

Pulgam Srinivas
మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మలయాళ ఇండస్ట్రీ లో అద్భుత మైన విజయాలను అందుకున్న ఈ హీరో ఇప్పటి కే తెలుగు లో కూడా మంచి విజయాలను అందు కున్నాడు . కొంత కాలం క్రితం విడుదల అయిన మహానటి అనే తెలుగు మూవీ ద్వారా మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్ అందు కున్నాడు .  తాజాగా సీతా రామం అనే మూవీ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దుల్కర్ సల్మాన్ అందు కున్నాడు .

ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ...  కెరీర్ ప్రారంభం లో నా మూవీ ల రివ్యూలు చదువుతూ ఉంటే చాలా బాదేసేది. నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. నాకు నటన రాదు అని  , నేను మూవీ లు ఆపేస్తే మంచిది అని , నా తండ్రిలా నేను నటుడి గా రాణించలేను అని ,  నటుడిగా పనికి రాను అని అన్నారు .  ఆ వ్యాఖ్యలు నన్నెంతో భాదించాయి అంటూ తాజాగా దుల్కర్ సల్మా ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: