కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయిన కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిచ్చా సుదీప్ ఇప్పటికే ఈగ , బాహుబలి , సైరా నరసింహారెడ్డి లాంటి డైరెక్ట్ తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రానా' అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ లో హీరోగా నటించాడు  ఈ మూవీ ని కన్నడ తో పాటు తెలుగు , తమిళ ,  హిందీ , మలయాళ భాషల్లో విడుదల చేయగా , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కిచ్చా సుదీప్ తాజాగా కే3 కోటికొక్కడు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కన్నడ లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది.

మూవీ దాదాపు 60 కోట్ల వరకు కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర సాధించింది. ఇలా కన్నడ లో ఇప్పటికే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన ఈ మూవీ ని కే3 కోటికొక్కడు అనే పేరుతో సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. అలాగే కే3 కోటికొక్కడు మూవీ రన్ టైమ్ ని కూడా మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలిస్తుంది. ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. శివ కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: