హాట్ టాపిక్ గా మారిన నాగశౌర్య పాదయాత్ర !

Seetha Sailaja
యంగ్ హీరో నాగశౌర్యకు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. గత సంవత్సరం అతడు నటించిన ‘వరుడు కావలెను’ ‘లక్ష్య’ సినిమాలు రెండు వరసగా పరాజయాలు పొందడంతో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితులలో ఈనెల చివరివారంలో విడుదల కాబోతున్న ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.  

అనీష్ ఆర్ కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీని తీసాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీగా ఈమూవీని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు చిన్న సినిమాలను అదేవిధంగా మీడియం రేంజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనితో సగటు ప్రేక్షకుడు టాప్ హీరోల సినిమాలను మీడియం రేంజ్ సినిమాలను పట్టించుకోడా అన్నసందేహాలు చాలామందికి వస్తున్నాయి.

దీనితో చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలకు ఇక మార్కెట్ ఉండదా అన్న సందేహాలు చాలామందికి వస్తున్న పరిస్థితులలో ‘కార్తికేయ 2’ ఘనవిజయం చాలామంది మీడియం రేంజ్ సినిమాల హీరోలకు నిర్మాతలకు మంచి జోష్ ను ఇచ్చింది. ఇలాంటి పరిస్థితులలో తనకు కూడ లక్ కలిసి వస్తుందని నాగశౌర్య తన ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ పై చాల నమ్మకంతో ఉన్నాడు. అయితే ఆనమ్మకానికితోడు తన సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకు వచ్చేలా నాగశౌర్య చేస్తున్న ఒక లేటెస్ట్ ప్రయత్నం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయ నాయకులు తమ ఇమేజ్ పెంచుకోవడానికి పాదయాత్రలు చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఆ ట్రెండ్ ను నాగశౌర్య తన మూవీ పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు. తన మూవీ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా ఈయంగ్ హీరో తిరుపతి నుండి మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ప్రతిరోజు ఆయా ఊళ్ళల్లో జనం మధ్య పాదయాత్ర చేయడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈప్రయత్నం సక్సస్ అయితే రానున్న రోజులలో మీడియం రేంజ్ హీరోలు అంతా జనం మధ్యకు వెళ్ళడానికి ఇలా రాజకీయ నాయకులు లా పాదయాత్రలు చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: