పవన్ అడిగితే ఏదైనా చేస్తా: జబర్దస్త్ ఆది

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ అంటే కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు.. సినీ నటులు, ప్రముఖులు కూడా ఎంతగానో అభిమానిస్తారు.ఆయన సేవా కార్యక్రమాలు తెలిసినవారు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ను  ఎంతగానో అభిమానిస్తారు.బుల్లితెర ఈటీవి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి కూడా పవన్ కళ్యాణ్ అంటే పంచప్రాణాలు. నాగబాబును, పవన్ కళ్యాణ్ ను ఆది చాలా ఎక్కువగా ఆరాధిస్తుంటాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎందుకు అంత ఇష్టం అన్న ప్రశ్నకు హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఈరోజు ఎవరినైనా డబ్బు మార్చేస్తుంది. పవన్ కళ్యాణ్ కు డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు.సినిమాల నుంచి వచ్చిన సొమ్మును కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సినిమా చేస్తే వచ్చే రూ.50 కోట్ల మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి.. పార్టీ కార్యకలాపాలకు.. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పంచేస్తారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిది' అంటూ పవన్ తీరును హైపర్ ఆది ఆకాశానికెత్తేశాడు.


అందరి మంచి కోరుకునే పవన్ కళ్యాణ్ కు మంచి జరగాలనే తాను కోరుకుంటున్నానని.. అలా జరిగితే ఎంతో సంతోషిస్తామని హైపర్ ఆది తెలిపారు. అందుకే తాను పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా కోసం చిన్న వర్క్ కూడా చేస్తున్నానని హైపర్ ఆది వివరించారు.ఇటీవల హరిహర వీరమల్లు సినిమా పనిమీద ఇటీవల నాలుగురోజులు పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిశానని.. ఆయన ఎంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైందని హైపర్ ఆది వివరించాడు.ఇక పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని హైపర్ ఆదిని ప్రశ్నించగా.. నవ్వుతూ దాటవేశారు.పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అంటూ ఆది చెప్పారు. దీన్ని బట్టి హైపర్ ఆది సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన టికెట్ ఆదికి వస్తుందని.. ఖచ్చితంగా ఆది జనసేనతోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేనలో చేరి అసెంబ్లీకి ఆది పోటీచేస్తాడని వార్తలు వస్తున్నాయి.మరి ఈ వర్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: