జబర్దస్త్ కమెడియన్స్ కి కూడా లోకువైన విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

praveen
ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కానీ ఈ సినిమా విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా  నిలిచింది. ఈ క్రమంలోనే నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు వచ్చాయి అని చెప్పాలి. అయితే లైగర్ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ఈ విషయంపై ఎంతోమంది ట్రోల్ చేయడం కూడా మొదలు పెట్టారు అని చెప్పాలి. మా తాత మా అయ్య ఎవడో కూడా తెలియదు. కానీ నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ నెపోటిసం  పై  కూడా ఇన్ డైరెక్ట్ గా పంచ్ వేసాడు విజయ్ దేవరకొండ. దీనిపై బండ్లగణేష్ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగి పోయింది అనే విషయం తెలిసిందే. ఇక ప్రెస్ వాళ్ల ముందు కూడా టేబుల్ పై కాళ్ళు పెట్టుకుని మాట్లాడటం మరింత వివాదాస్పదంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలా లైగర్ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎంత చూపించాలో అంత ఆటిట్యూడ్ చూపించాడు.

 ఇక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ చూపించిన ఆటిట్యూడ్ కి సినిమా కు ఏమైనా సంబంధం ఉందా అని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కూడా విజయ్ దేవరకొండ రావడం లేదు అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఒక స్కిట్ లో భాగంగా విజయ్ దేవరకొండ డైలాగ్స్ స్పూఫ్ చేశారు. భాస్కర్ తన స్కిట్ లో భాగంగా మా తాత ఆర్టిస్ట్ కాదు మా అయ్య ఆర్టిస్ట్ కాదు నేను ఆర్టిస్ట్ కాదు కానీ ఏందిరా ఈ క్రేజ్ అంటూ కొన్ని డైలాగులు చెప్పాడు. కావాలనే ఇలా విజయ్ దేవరకొండ పై బుల్లెట్ భాస్కర్ సెటైర్ వేసాడు అంటూ అందరూ భావిస్తూ ఉండటం గమనార్హం. కానీ ఎప్పుడూ సినిమా వాళ్ళ డైలాగుల్ని జబర్దస్త్ లో స్పూఫ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: