మహేష్ బాబు కోసం అదిరిపోయే టైటిల్!!

P.Nishanth Kumar
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. మహేష్ బాబు సరికొత్త లుక్కులో కనిపిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకగా నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని ఎంతో వెరైటీగా చేయడానికి సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతుంది అని చెబుతున్నారు.

సినిమాలను తెరకెక్కించడంలో ఎంతో వెరైటీని ప్రదర్శించే త్రివిక్రమ్ ఈ సినిమాను సరికొత్త స్క్రీన్ ప్లే తో రూపొందించబోతున్నార ని అంటున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ ను నిర్ణయించని చిత్ర బృందం త్వరలోనే దారిని వెల్లడించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబు కు తగ్గా ఒక మంచి టైటిల్ను ఇప్పటికే ఎంపిక చేయబోతున్నారని చెబుతున్నారు. పలు టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత చివరగా ఆరంభం అనే టైటిల్ ని పెట్టడానికి ఎక్కువ గా చిత్ర బృందం ముగ్గు చూపుతుందట. అది ప్రేక్షకులను ఆరాధించబోతుంది అని చెబుతున్నారు. 

ఈ సినిమా కథ విషయంలో చాలా రోజుల సమయం తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా అంతే బాగా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని ఆయన అభిమానులకు నచ్చే విధంగా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను మొదలుపెట్టడానికి చూస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: