'నేను మీకు బాగా కావలసిన వాడిని' మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం ఈ సంవత్సరం సేభాష్టియన్ , సమ్మతమే అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహిస్తూ ఉండగా,  మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఎలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ ముగించినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ని కూడా చిత్ర బృందం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2 గంటల 10 నిమిషాల మామూలు నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సెబాస్టియన్ , సమ్మతమే మూవీ లతో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: