బాలీవుడ్ వారికి జక్కన్న భలే దొరికాడుగా!!

P.Nishanth Kumar
బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని సినిమాలన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా రోజుల తర్వాత బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు భారీ విజయం తెచ్చిపెట్టింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా పలు భాషలలో విడుదల కాగా విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఆ విధంగా తెలుగులో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావడానికి కారణం రాజమౌళి అనే చెప్పాలి.

ఆయన ఈ సినిమాకి ముందు నుంచి ప్రమోషన్ నిర్వహించడం జరిగింది. అందుకే ఈ సినిమా మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. మొదటి నుంచి నిర్మాత జోహార్ ఈ సినిమా కోసం రాజమౌళి వాడుకోవాలనీ చాలానే ప్రయత్నాలు చేశాడు. అందుకే రాజమౌళి కూడా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం మేరకు ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నాడు. మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా రాజమౌళితో ప్రమోషన్ చేయించడం ఈ సినిమాకు బాగానే ఉపయోగపడింది అని చెప్పాలి.

ఆ విధంగా ఇప్పుడు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో రాజమౌళి ఒక ప్రచారాస్త్రంగా దొరికాడు అనే టాక్ వినిపిస్తుంది. అక్కడ పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్న కొన్ని సినిమాలు తెలుగులో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించాలి అంటే తప్పకుండా జక్కన్న లాంటి ఒక ఫేమస్ పర్సన్ ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. అందుకే మహాభారతం అనే సిరీస్ కు సంబంధించి తెలుగు వర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ జక్కన్నతో చేయించుకోవాలని ఆ ప్రొడ్యూసర్ భావిస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల లో ఉన్న ఆయన ఈ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రచారకర్తగా వ్యవహరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను చేస్తున్నాడు. బాహుబలి సినిమాకు బాలీవుడ్ లో కరణ్ జోహార్ అందించిన సహాయం మేరకు ఈ సినిమా కోసం ఆయన ఇంతటి ప్రచారం చేశాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: