డాన్సర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కండక్టర్ ఝాన్సీ......???

murali krishna
ఈ మధ్యకాలంలో కండక్టర్ ఝాన్సీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తన శ్రీదేవి డ్రామా కంపెనీ పల్సర్ బండి పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది ఆమె పదులకొద్దీ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ప్రతి ఇంటర్వ్యూలో కూడా డాన్సర్ గా తాను పడ్డ కష్టాలను ఆమె చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. డాన్స్ చేసేందుకు పల్లెటూర్లకు వెళ్లిన సమయంలో అక్కడి వారు అత్యంత హీనంగా చూస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
డాన్స్ చేయడానికి ముందు డాన్స్ చేసిన తర్వాత కనీసం డ్రెస్సులు మార్చుకునేందుకు కూడా ఇంట్లోకి రానిచ్చేవారు కాదని, చాలా మంది తమను ఇంట్లోకి రానివ్వడం వల్ల పరువు పోతుంది అనే భావన కలిగి ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
బట్టలు మార్చుకోవడానికి ఇంట్లోకి రానివ్వక పోవడంతో తామే ఒక ప్రత్యేకమైన టెంట్ రూముని ఏర్పాటు చేసుకొని స్టేజి వెనకాల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నామని.. ఆ టెంట్ రూమ్ ని తాము కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తే అక్కడికి తీసుకు వెళ్తామని చెప్పుకొచ్చింది.
కొందరు జనాలు డాన్సర్స్ ని అత్యంత హీనంగా చూస్తారని.. ముఖ్యంగా మాలాంటి డాన్సర్స్ ని చాలా హీనంగా చూసి కనీసం ఇంట్లో కి కూడా రానిచ్చేవాళ్ళు కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పుడు ఆమె ఒక స్టార్ సెలబ్రిటీ గా మారి పోయింది.. ఆమెతో ఫోటోలు దిగేందుకు వందల కొద్ది జనాలు క్యూ కడుతున్నారు. అయినా కూడా ఆమెను ట్రోల్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. ఆమె భర్తని కూడా ఇష్టానుసారంగా తిడుతూ నే ఉన్నారు.
సోషల్ మీడియా లో ఆమెకు ఎంత పాపులారిటీ వచ్చిందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఝాన్సీ ధైర్యంగా ముందుకు వెళ్లడం అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: