అయ్యో పాపం ఆ స్టార్ హీరో.... పరిస్థితి.... అందరికి లోకువయ్యాడు...??

murali krishna
లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ కి దొరికిపోయాడు పాపం . విడుదలకు ముందు మనోడు చూపించిన యాటిట్యూడ్ మనసులో పెట్టుకొని నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
లైగర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ తీరు వివాదాస్పదమైంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నెపోటిజంపై అతడు సెటైర్ వేశాడు. 'మా తాత ఎవడో తెల్వదు, మా అయ్య ఎవడో తెల్వదు, మా అన్న ఎవడో తెల్వదు… అయినా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు' అని కామెంట్ చేశారు. ఆటోమేటిక్ గా ఇది స్టార్ కిడ్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ అని అందరూ భావించారు.
దీనికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఉంటే సరిపోదు… మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ మాదిరి టాలెంట్ కూడా ఉండాలి, అని పోస్ట్ చేసాడు.. ఇక విజయ్ దేవరకొండ లైగర్ మూవీ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు. ఆగస్టు 25న ఇండియన్ బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఆగ్ లగా దేంగే.. అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు. ప్రెస్ వాళ్లతో టేబుల్ పై కాళ్ళు పెట్టి మాట్లాడటం కూడా వివాదాస్పదమైంది. ఇలా విజయ్ దేవరకొండ చూపించాల్సిన యాటిట్యూడ్ మొత్తం ఒకేసారి చూపించేశాడు.
తీరా సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా పోయిందని తెలిసిన వెంటనే విజయ్ దేవరకొండపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు చూపించిన యాటిట్యూడ్ కి చేసిన సినిమాకు సంబంధం ఉందా అంటూ ఆడేసుకున్నారు. ఇంకా అతి చేస్తే డామేజ్ మరింతగా ఉంటుందని విజయ్ సదరు ట్రోల్స్ పై మౌనం వహించాడు. కాగా విజయ్ దేవరకొండను జబర్దస్త్ కమెడియన్స్ కూడా వదలడం లేదు. లేటెస్ట్ స్కిట్ లో తన డైలాగ్ చెప్పి ట్రోల్ చేశారు. బులెట్ భాస్కర్ తన స్కిట్ లో..'మా తాత ఆర్టిస్ట్ కాదు, మా అయ్య ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు.. ఏందిరా ఈ క్రేజ్' అంటూ ఫన్నీగా డైలాగ్ చెప్పాడు.
ఈ డైలాగ్ విజయ్ దేవరకొండపై సెటైర్ గా అందరూ భావిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ ఆయన్ని ట్రోల్ చేశారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి బాహుబలి నుండి పుష్ప దాకా స్టార్ హీరోల సినిమాలు, వాళ్ళ డైలాగ్స్ జబర్దస్త్ లో స్పూఫ్స్ చేస్తూ ఉంటారు. అయితే లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేసినట్లు అయ్యింది. దీనిపై నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: