ఎల్లో కలర్ డ్రెస్ లో అదరగొడుతున్న కేతిక శర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ మొదటి మూవీ లో తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి వరుస అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేతికా శర్మ రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఆకాష్ పూరి హీరోగా నటించాడు.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో కేతిక శర్మ మాత్రం తన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లక్ష్య మూవీ లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. తాజాగా రంగ రంగా వైభవంగా అనే మూవీ లో  కేతిక శర్మ , పంజా వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కేతిక శర్మ సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
 

తన అంత చందాలతో ఇప్పటికే ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ అప్పు డప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కేతిక శర్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని , దానికి తగిన ఎల్లో కలర్ చున్నీ ని వేసుకొని ఉన్న ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: