మీడియం రేంజ్ హీరోలను ఖంగారు పెడుతున్న దుల్కర్ సల్మాన్ !

Seetha Sailaja
మీడియం రేంజ్ హీరోల లిస్టులో ప్రధమ స్థానంలో నాని ఉంటే ఆతరువాత స్థానంలో విజయ్ దేవరకొండ నితిన్ రామ్ లు కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ నలుగురికి వరస పరాజయాలు ఎదురవుతున్నాయి. విజయ్ దేవరకొండ మాత్రం వచ్చేవారం విడుదలకాబోతున్న ‘లైగర్’ మూవీతో తన దశ తిరుగుతుందని కలలు కంటున్నాడు.

లేటెస్ట్ గా రిలీజ్ ఆమధ్య రిలీజ్ అయిన నాని లేటెస్ట్ గా విడుదలైన నితిన్ రామ్ ల సినిమాలు పరాజయం చెందడంతో వారంతా షాక్ లో ఉన్నారు. అయితే వీరంతా ఈసినిమాలు చేసేయడానికి ముందు వారి దగ్గరకు హను రాఘవపూడి తన ‘సీతా రామం’ కథను పట్టుకుని తిరిగాడట. అయితే అప్పటికే హను రాఘవపూడి తీసిన ‘పడిపడి లేచె మనసు’ మూవీ ఫ్లాప్ గా మారడంతో వారంతా హను రాఘవపూడి చెప్పిన ‘సీతా రామం’ కథను నమ్మలేకపోయారట.

అయితే ఇప్పుడు వీరంతా అలాంటి మూవీ కథను వదులుకున్నందుకు బాధ పడుతున్నారట. ముఖ్యంగా నాని ఈవిషయంలో మరింత బాధపడుతున్నట్లు టాక్. వాస్తవానికి హను రాఘవపూడి నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీ తీసినప్పటి నుండి వారిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే నాని ఎందుకనో ఈకథను నమ్మలేకపోయాడు అని అంటారు. దీనితో హను రాఘవపూడి నిరాశ చెందకుండా దుల్కర్ సల్మాన్ ను స్వప్నా దత్ రాయబారంతో కలిసి అతడికి కథ చెప్పగానే మరొక మాట చెప్పకుండా దుల్కర్ ఈమూవీని చేయడానికి అంగీకరించాడు అని అంటారు.

ధియేటర్లకు ప్రక్షకులు రాక బెంబేలెత్తిపోతున్న పరిస్థితులలో విడుదలైన ఈమూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా దుల్కర్ మారిపోయాడు. వాస్తవానికి దుల్కర్ వయసు 35 సంవత్సరాలు దాటిపోవడంతో లవ్ స్టోరీస్ ఇక చేయకూడదు అని అనుకున్నాడట. అయితే ఇప్పుడు దుల్కర్ కు ఏర్పడిన లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు అతడు ప్రయత్నిస్తున్న యాక్షన్ హీరో ప్రయత్నాలు కూడ సక్సస్ అయితే ఒక మళయాళ హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మీడియం రేంజ్ హీరోగా మారిపోయే ఆస్కారం ఉంది అని అన్నమాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: