ఎట్టకేలకు బాలీవుడ్ గట్టెక్కినట్లే!!

P.Nishanth Kumar
ఇటీవలే బాలీవుడ్ లో రూపొందే సినిమా లకు ఏమాత్రం ప్రేక్షకులు ఆదరణ అందించడం లేదు. దాంతో బాలీవుడ్ లో హిట్ తేగలిగే సినిమాలు ఏవి ఉంటాయా అని అందరు ఆసక్తి గా ఎదురుచూశారు. దానికి తోడు బాయ్ కాట్ ట్రెండ్ కూడా బాలీవుడ్ లో చాలా సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన `బ్రహ్మాస్త్ర` సినిమా బాలీవుడ్ లో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ సినిమా పోయిన శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అయితే ఆ మిశ్రమ స్పందన తో మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.
మెల్లమెల్లగా ఈ సినిమా ను చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. కంటెంట్‌ లో దమ్ము లేదని, అసలు కథ ఇందులో లేదంటూ చాలా వరకు అసంతృప్తి వ్యక్తమయ్యింది. అయితే అది కేవలం పుకారు అని ప్రేక్షకులు చివరిగా తేల్చేశారు. ఈ సినిమా లో మంచి కథ, స్క్రీన్ ప్లే తో పాటు విజువల్‌గా అద్భుతంగా ఉందంటూ క్రిటిక్స్, ఆడియెన్స్ సైతం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలా ఈ సినిమా ఈ వారాంతం మంచి వసూళ్లను అందుకునే విధంగా ముందుకు దూసుకుపోతుంది. మొదట్లో బాలీవుడ్‌ క్రిటిక్స్ సైతం ఈ సినిమా డిజాస్టర్‌గా ప్రకటించారు.
ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఏకంగా కింగ్‌ సైజ్‌ డిజప్పాయింట్‌మెంట్ అంటూ పోస్ట్ చేశారు. అయితే ప్రేక్షకుల ఆసక్తి ముందు వీరందరి నెగిటివిటీ ఏమాత్రం ఫలించలేదని చెప్పాలి. ఈ సినిమా తో బాలీవుడ్ ఎప్పటినుంచో కోరుకుంటున్న విజయం దక్కింది. చాలా రోజుల తర్వాత ఇంతటి విజయం రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. బాహుబలి తర్వాత అంతటి క్యాన్వాస్ ఉన్న సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచిపోయింది. దీనికి తోడు ఈమధ్య సినిమాలేవీ కూడా లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. విజువల్ గా కన్నుల పండుగగా ఉన్న ఈ సినిమా ను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి పరుస్తూ ఉండడం విశేషం. మరి భవిష్యత్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. మంచి వసూళ్లను సాధించి బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తుంది అని మాత్రం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: