రామ్ పోతినేని సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసిన బోయపాటి శ్రీను..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పాన్ ఇండియా మూవీబ్గా తెరకెక్కబోతుంది. వీరిద్దరి కి కూడా ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న విషయం మనకు తెలిసిందే.  

బోయపాటి శ్రీను ఇప్పటికే రామ్ పోతినేని మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు అలాగే ఈ మూవీ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ , యాక్షన్ డ్రామాగా తేరకేక్కబోతున్నట్లు అలాగే ఈ కథ కేరళ ప్రాంతం నేపథ్యంలో సాగనునట్లు , ఈ మూవీ లో రామ్ పోతినేని అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని కొంత కాలం క్రితమే లింగుసామి దర్శకత్వంలో దొరికేక్కిన ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను ఆఖరుగా బాలకృష్ణ హీరో గా అఖండ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని  సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: